IPL 2023: Matheesha Pathirana Become Most Wickets In Death Overs - Sakshi
Sakshi News home page

IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా!

Published Thu, May 11 2023 8:51 AM | Last Updated on Thu, May 11 2023 9:59 AM

Matheesha Pathirana Becomea Most wickets in death overs in IPL 2023 - Sakshi

ఐపీఎల్‌-2023లో శ్రీలంక యువ పేసర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మతీష పతిరన అదరగొడుతున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరన అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన పతిరన తన నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు.

ఈ క్రమంలో "బేబీ మలింగా" ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో డెత్‌ ఓవర్లలో(16-20) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా పతిరన నిలిచాడు. ఇప్పటివరకు డెత్‌ఓవర్లలో అతడు 12 వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు ఈ ఘనత మరో సీఎస్‌కే పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన ఈ శ్రీలంక పేసర్‌ దేశ్‌పాండే రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 27 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.


చదవండి: IPL 2023: అతడిని బాగా మిస్‌ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement