ఆర్సీబీతో తొలి మ్యాచ్‌.. సీఎస్‌కే అదిరిపోయే న్యూస్! యార్కర్ల కింగ్‌ వచ్చేశాడు? | IPL 2024: Matheesha Pathirana declared fit | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీతో తొలి మ్యాచ్‌.. సీఎస్‌కే అదిరిపోయే న్యూస్! యార్కర్ల కింగ్‌ వచ్చేశాడు?

Published Fri, Mar 22 2024 5:25 PM | Last Updated on Fri, Mar 22 2024 5:51 PM

IPL 2024: Matheesha Pathirana declared fit - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌-2024 సీజన్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.  చెపాక్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సీఎస్‌కే అదిరిపోయే న్యూస్‌ అందింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు యువ పేసర్‌, శ్రీలంక యార్కర్ల కింగ్‌ మతీషా పతిరాన  పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. తొలి మ్యాచ్‌ జట్టు సెలక్షన్‌కు పతిరాన అందుబాటులో ఉండే ఛాన్స్‌ ఉంది. ఈ విషయాన్ని అతడి మేనేజర్ అమిలా కలుగలగే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

పతిరానా ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. అతడు నిప్పులు చేరిగేందుకు సిద్దమయ్యాడని పతిరానాతో కలిసి ఉన్న ఫోటోను కలుగలగే ఎక్స్‌లో షేర్‌ చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పతిరానా మోకాలికి గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.  టీ20 సిరీస్‌ మధ్యలోనే వైదొలిగిన పతిరానా నేరుగా కొలంబోలోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు వెళ్లి పునరవాసం పొందాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 ఫస్ట్‌హాఫ్‌కు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి.  కానీ అతడు ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో భాగం కానున్నాడు. అతడికి శ్రీలంక క్రికెట్‌ కూడా క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గతేడాది సీఎస్‌కే ఛాంపియన్స్‌గా నిలవడంలో పతిరానాది కీలక పాత్ర. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు.

చదవండి: IPL2024: 'సీఎస్‌కే ఓపెనర్‌గా యువ సంచ‌ల‌నం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement