Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్‌లో తమను ఓడించడం అంత సులువు కాదని సీఎస్‌కే మరోసారి నిరూపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ సీఎస్‌కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్‌కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. డెవన్ కాన్వే 77 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.,
ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ధోనిని ఎస్‌ఆర్‌హెచ్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్దగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసిదంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు.
గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ధోని సలహాలతోనైనా ఎస్‌ఆర్‌హెచ్‌లో మార్పు వస్తుందేమో.. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది హ్యాట్రిక్ పరాజయం.
MS Dhoni having a discussion with Umran Malik and all other youngsters listening carefully.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2023
What a lovely picture! pic.twitter.com/hFZA4RtX2s
చదవండి: Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే
Comments
Please login to add a commentAdd a comment