
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీరియస్‌గా ఆట సాగుతున్న వేళ లంక ఆటగాళ్లు ఒక సీరియస్ రనౌట్‌ను కాస్త కామెడీగా మార్చేశారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 125వ ఓవర్‌ను విశ్వా ఫెర్నాండో వేశాడు. రవీంద్ర జడేజా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 150 పరుగుల మార్క్ దాటి డబుల్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. అతనికి షమీ కూడా చక్కగా సహకరిస్తున్నాడు.
ఫెర్నాండో జడేజాకు ఆఫ్ కట్టర్ వేయగా.. మిడ్ వికెట్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం జడేజా ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ వేసిన బంతిని అందుకోవడంలో ఫెర్నాండో విఫలమయ్యాడు. అలా జడేజా బతికిపోయాడు. ఇదే సమయంలో షమీ కూడా దాదాపు నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తుకొచ్చాడు. ఇక షమీ ఔట్ అని అంతా భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. స్ట్రైకింగ్ ఎండ్ నుంచి కీపర్ బంతి ఇవ్వు అని అరిచాడు.. ఫెర్నాండో బంతిని తీసుకున్నప్పటికి విసరలేకపోయాడు. అప్పటికే షమీ వేగంగా పరిగెత్తి అవతలి ఎండ్‌కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన రవీంద్ర జడేజా 175 నాటౌట్‌గా నిలిచి 25 పరుగుల దూరంలో నిలిచాడు. దీంతో రోహిత్ కూడా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 175*, రిషబ్ పంత్ 96, హనుమ విహారి 58, కోహ్లి 45 పరుగులు చేశారు.
— crictalk (@crictalk7) March 5, 2022
Comments
Please login to add a commentAdd a comment