చ‌రిత్ర స‌ష్టించిన ధోని.. ఐపీఎల్‌లో తొలి ఆట‌గాడిగా | MS Dhoni breaks record for effecting most run outs in IPL history | Sakshi
Sakshi News home page

IPL 2024: చ‌రిత్ర స‌ష్టించిన ధోని.. ఐపీఎల్‌లో తొలి ఆట‌గాడిగా

Published Sat, Mar 23 2024 5:06 PM | Last Updated on Sat, Mar 23 2024 6:09 PM

MS Dhoni breaks record for effecting most run outs in IPL history - Sakshi

ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోని అరుదైన ఘ‌న‌త సాధించాడు.  ఐపీఎల్‌లో అత్య‌ధిక రౌన‌ట్లు చేసిన ఆట‌గాడిగా ధోని రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా  ఆర్సీబీతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావ‌త్‌ను ర‌నౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్ట‌ర్ కూల్‌.. 24 ర‌నౌట్లు చేశాడు. ఇంతకు ముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడేజా.. మొత్తం 23 రనౌట్‌లు చేశాడు. తాజా మ్యాచ్‌తో జ‌డేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు.

కాగా ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు సీఎస్‌కే జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి ధోని త‌ప్పుకున్నాడు. త‌న బాధ్య‌త‌ల‌ను యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్ప‌గించేశాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే బోణీ కొట్టింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజ‌యం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement