క్రికెట్ అంటే ఆట ఒక్కటే కాదు.. మ్యాచ్ ఆడుతున్నామంటే ఆటగాడు ప్రతీ మూమెంట్ మ్యాచ్‌పైనే ఉండాలి. అంతే కానీ బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సెంట్ అయితే ఊహించని సంఘటనలు జరుగుతాయి. కొన్నిసార్లు తెలివితక్కువగా చేసే పనుల వల్ల ఆయా జట్లు చాలా నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా క్రికెట్ లాంటి ఆటల్లో టీమ్ వర్క్ చాలా ముఖ్యం. తాజాగా అలాంటి ఘటనే భారత్‌లో జరిగింది.
విషయంలోకి వెళితే.. మ్యాట్ పిచ్‌పై ఒక లోకల్ మ్యాచ్ నిర్వహించారు. బంతిని అందుకున్న ఫీల్డర్ బౌలర్‌కు త్రో వేశాడు. అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు సింగిల్ పూర్తి చేశారు. బంతిని అందుకునే లోపే బ్యాటర్ మరో పరుగుకు యత్నించాడు. అప్పుడు బౌలర్ స్ట్రైక్‌ఎండ్‌వైపు బంతిని విసరకుండా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు కొట్టాడు. కానీ అప్పటికే రెండో పరుగు కూడా పూర్తి చేశారు. విచిత్రమేంటంటే.. వికెట్లకు తాకిన బంతి మరోసారి బౌండరీ వైపు పరుగులు పెట్టింది.
దీంతో మూడో పరుగు కోసం బ్యాటర్ పరిగెత్తడం.. ఈసారి కూడా ఫీల్డింగ్ జట్టు మినిమం కామన్‌సెన్స్ ఉపయోగించకుండా స్ట్రైక్‌ఎండ్ వైపు బంతిని విసిరారు. ఏం లాభం అప్పటికే మూడు పరుగులు వచ్చాయి. ఇక నాలుగో పరుగు కోసం పరిగెత్తగా అప్పటికి కానీ జ్ఞానోదయం కాని సదరు ఫీల్డర్లు మొత్తానికి బ్యాటర్‌ను రనౌట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 27, 2023
Comments
Please login to add a commentAdd a comment