లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పోరాడతోంది. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(108) పరుగులతో అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు.
ఏం జరిగిదంటే?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు.
సాధారణంగా ఒక ఆటగాడు ఓవర్ పూర్తి అయిన వెంటనే క్రీజు నుండి బయటకు వచ్చే ముందు కీపర్ లేదా అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే డెడ్‌బాల్(ఓవర్ పూర్తి అయినట్లు)గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బెయిర్‌స్టో అలా చేయనందున అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని చూసిన బెయిర్ స్టో ఆశ్యర్యపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్‌స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.
ఆసీస్ ఛీటర్స్..
ఇంగ్లండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా రనౌట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం సరికాదని ఆసీస్ జట్టుపై విమర్శల గుప్పిస్తున్నారు. మరి కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
చదవండి: Ind vs WI: వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఫోటో వైరల్
BAIRSTOW IS RUN-OUT.
— Johns. (@CricCrazyJohns) July 2, 2023
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3
Comments
Please login to add a commentAdd a comment