Watch Video: Finn Allens Bat Gets Stuck While Running, Gets Run Out In Bizarre Fashion - Sakshi
Sakshi News home page

MCL Finn Allens Run Out Video: ​పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే! వీడియో వైరల్‌

Published Sun, Jul 16 2023 5:43 PM

Finn Allens bat gets stuck while running, gets run out in bizarre fashion - Sakshi

మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్‌ ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో 142 పరుగులకే ఆలౌటైంది. సీటెల్ ఓర్కాస్‌ విజయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్‌ ఫిన్ అలెన్ విచిత్రకర రీతీలో ఔటయ్యాడు.

ఏం జరిగిందంటే?
శాన్ ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్‌ నాల్గవ ఓవర్‌ వేసిన కామెరాన్ గానన్ బౌలింగ్‌లో రెండో బంతిని అలెన్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డర్‌ కాస్త దూరంగా ఉండడంతో ఈజీగా పరుగు తీయవచ్చని అలెన్‌ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే ఫీల్డర్‌ షెహన్ జయసూర్య వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రీజుకు దగ్గరలో ఉన్న అలెన్‌ కాస్త వేగంగా పరిగిత్తే ప్రయత్నం చేశాడు.

కానీ దురదృష్టవశాత్తూ బ్యాట్‌ పిచ్‌లో  ఇరుక్కుపోయి కింద పడిపోయింది. అంతలో షెహన్ జయసూర్య స్టంప్స్‌ను పడగొట్టడంతో అలెన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగులు చేసిన అలెన్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అలెన్‌ రనౌట్‌ మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రనౌట్‌పై ఓ యూజర్‌ స్పందిస్తూ.. "పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే" అంటూ కామెంట్‌ చేశాడు.
చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి

Advertisement
 
Advertisement
 
Advertisement