ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి మరోసారి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సంచలన త్రో తో మెరిశాడు.
కళ్లు చెదిరే త్రోతో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్‌ను కింగ్ కోహ్లి రనౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని డిప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే డిప్ మిడ్ వికెట్‌లో ఫీల్డర్ లేకపోవడంతో సామ్ కుర్రాన్ రెండో పరుగుకు పిలుపునిచ్చాడు.
ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. బంతిని అందుకునే క్రమంలో కోహ్లి బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి గురి మాత్రం తప్పలేదు. బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.
కోహ్లి రనౌట్ చూసిన సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.
He's unfolding magic tonight 💫
First with the bat & now on the field with that outstanding direct hit 🎯
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRCB | @imVkohli | @RCBTweets pic.twitter.com/6TsRbpamxG— IndianPremierLeague (@IPL) May 9, 2024
Comments
Please login to add a commentAdd a comment