Photo:IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో దినేశ్ కార్తిక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని కార్తిక్ తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేసిన కార్తిక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫినిషర్ పాత్రకు న్యాయం చేయని దినేశ్ కార్తిక్ ఒక పనికిమాలిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రనౌట్లలో పాలుపంచుకున్న బ్యాటర్‌గా దినేశ్ కార్తిక్ తొలి స్థానంలో నిలిచాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సుయాష్ శర్మ వేసిన బంతిని కార్తిక్ డీప్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన కార్తిక్ రెండో పరుగు కోసం యత్నించాడు. అయితే మిస్ కమ్యునికేషన్ వల్ల సుయాష్ ప్రభుదేశాయ్ ఆలస్యంగా స్పందించాడు. అప్పటికే బంతిని అందుకున్న అనుకుల్ రాయ్ సుయాష్‌కు త్రో వేయగా..అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ప్రభుదేశాయ్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలోనే దినేశ్ కార్తిక్ ఐపీఎల్ చరిత్రలో 39వ రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. కార్తిక్ తర్వాతి స్థానంలో 37 రనౌట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉండగా.. 35 రనౌట్లతో ధోని మూడో స్థానంలో, 30 రనౌట్లతో రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు.
Dinesh Karthik The Greatest Finisher Will Finish RCB One Day 😭😂. pic.twitter.com/iGsxXmfERB
— Aufridi Chumtya (@ShuhidAufridi) April 26, 2023
చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment