మాంచెస్టర్: 12 బంతుల్లో 31 పరుగులు. సెమీస్‌లో టీమిండియా గెలుపుకు సమీకరణాలు. క్రీజులో కొండంత ధైర్యం ఎంఎస్ ధోని ఉండటంతో అందరిలోనూ గెలుపుపై భరోసా ఉంది. అయితే న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. అర్దసెంచరీతో రాణించినా కీలక సమయంలో అవుటవ్వడం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది.
ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్‌లో అందరి అంచనాలను నిజం చేస్తూ ధోని తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ. రెండో బంతిని కీపర్ ఎండ్స్‌వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో ధోని తడబడ్డాడు. గప్టిల్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో ధోని రనౌట్ అయ్యాడు. ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపి టీమిండియా ఓటమకి కారణమైంది. రనౌట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ధోని రనౌట్ టీమిండియా కొంప ముంచింది. ఓటమికి కారణమైంది. ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment