
బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో హార్దిక్ రనౌటయ్యాడు.
ఏం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన విండీస్ స్పిన్నర్ యాన్నిక్ కరియా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో కార్నియా క్యాచ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బౌన్స్ అయి నేరుగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కాస్త క్రీజు నుంచి ముందు ఉన్నట్లు అన్పించింది.
దీంతో ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తొలుత రిప్లేలో హార్దిక్ క్రీజుకు చేరుకున్నప్పటికీ, బెయిల్స్ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాలిలో ఉన్నట్లు కన్పించింది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ పాండ్యాను రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో 5 పరుగులు చేసిన హార్దిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సలు పాండ్యాది ఔటా?
ఇక పాండ్యాపై రనౌట్‌పై బిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నౌటాట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచితే చాలు.
ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే పరిగిణలోకి తీసుకోవాలి. అంటే బ్యాట్ గాలిలో ఉండగా స్టంప్ప్‌ను గిరాటేసినప్పటికీ.. బ్యాటర్ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ హార్దిక్ విషయంలో మాత్రం విండీస్‌కు ఫేవర్ థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు.
చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ
☝️dismissed by a whisker🤏#Windies secure the big wicket of #HardikPandya 🫤
— JioCinema (@JioCinema) July 27, 2023
Keep watching #WIvIND - LIVE & FREE on #JioCinema in 11 languages ✨
#SabJawaabMilenge pic.twitter.com/00TiGVvFhs