
ఐపీఎల్ 2022లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు రవి బిష్ణోయి సూపర్ రనౌట్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆండ్రూ టై వేశాడు. ఓవర్ మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ ప్యాడ్స్‌తో పాటు బ్యాట్‌ను తాకుతూ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అదే సమయంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రవి బిష్ణోయి బంతిని వేగంగా అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. గైక్వాడ్ క్రీజులోకి చేరుకోవడానికి ముందే బంతి వికెట్లను గిరాటేసింది.
రిస్క్ అని తెలిసినా సింగిల్‌కు ప్రయత్నించిన గైక్వాడ్ అనవసరంగా రనౌట్ అయ్యాడు.దీంతో గైక్వాడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇంకా విచిత్రమేంటంటే ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు అని మనం అనుకునేలోపే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment