క్రికెట్‌లో రనౌట్స్ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్ కీపర్ లేదా బ్యాటర్ లేదా ఫీల్డర్ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్ క్రికెట్ సందర్భంగా వికెట్ కీపర్ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు.
విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ లాంగాఫ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్ ఎండ్ నుంచి మిడిల్ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది.
అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్ అయ్యాననుకొని స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్ బెయిల్స్ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్ మాత్రం తాను బెయిల్స్ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు.
కానీ బ్యాటర్ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్ పడగొట్టలేదు నేను ఔట్ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్ చూపించాడు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడేస్తేనే రనౌట్ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్ చేయనందుకు సదరు బ్యాటర్ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్ ఏం చేయలేక బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2023
చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'
Comments
Please login to add a commentAdd a comment