క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది క్రికెట్‌లో ఒక సూత్రం. పటిష్ట ఫీల్డింగ్ వల్ల చాలా జట్లు అద్భుతమైన విజయాలు అందుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. క్యాచ్‌లు డ్రాప్ చేస్తే చివాట్లు పెట్టడం.. స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకుంటే మెచ్చుకోవడం చూస్తుంటాం. తాజాగా యార్క్‌షైర్ క్రికెట్ సదరన్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాంటి ఫన్నీ ఘటనే చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. హ్యాట్‌ఫీల్డ్ వేదికగా హ్యాట్‌ఫీల్డ్ టౌన్ సీసీ ఫస్ట్ ఎలెవెన్, హల్లమ్ సీసీ సెకండ్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హల్లమ్ సీసీ ఎలెవెన్ బౌలింగ్‌కు దిగింది. మ్యాచ్ సాధారణంగా సాగుతున్న వేళ ఒక క్యాచ్‌ను ఫీల్డర్ జారవిడిచాడు. దీంతో ఆటగాళ్లంతా నిరాశకు లోనయ్యారు. అయితే మరుసటి బంతికే ఎవరు ఊహించని విధంగా క్యాచ్ జారవిడిచిన ఫీల్డరే మరోసారి మెరిశాడు. బౌలర్ వేసిన బంతిని స్లిప్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హల్లమ్ సీసీ తొలుత బ్యాటింగ్ చేసి 249 పరుగులు చేసింది. విలియమ్ కోట్స్ 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హ్యాట్‌ఫీల్డ్ 167 పరుగులకే కుప్పకూలింది. హల్లమ్ కెప్టెన్ నిక్ కూపర్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఏడు బౌండరీల సాయంతో 36 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
"He only takes the hard ones" 😂
— That’s So Village (@ThatsSoVillage) July 2, 2023
Absolute scenes from @HatfieldTownCC! pic.twitter.com/w4hLzRfR9l
చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
Comments
Please login to add a commentAdd a comment