T20 World Cup India Vs South Africa 2022 Rohit Sharma Missed Golden Run-out Chance
Sakshi News home page

IND vs SA, T20 WC 2022: రోహిత్‌ మరీ ఇంత బద్దకమా..

Published Sun, Oct 30 2022 7:46 PM | Last Updated on Sun, Oct 30 2022 9:32 PM

Fans Angry Rohit Sharma Missed Golden Run-out Chance Aiden Markram - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఫేలవమైన ఫీల్డింగ్‌ టీమిండియా కొంపముంచుతుంది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌లో మరీ బద్దకంగా కనిపించాడు. మార్ర్కమ్‌ రనౌట్‌ విషయంలో రోహిత్‌ వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఐదో బంతిని మిల్లర్‌ ఆన్‌సైడ్‌ ఆడాడు. సింగిల్‌కు కాల్‌ ఇచ్చిన మిల్లర్‌  పరిగెత్తేలోపే బంతి రోహిత్‌ శర్మ అందుకున్నాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న మార్క్రమ్‌ క్రీజు మధ్యలోనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ మంచి రనౌట్‌ చాన్స్‌ మిస్‌ చేశాడు.  ఎంత టైమ్‌ గ్యాప్‌ ఉందంటే.. డైరెక్ట్‌ హిట్‌ కాకపోయినా.. కనీసం వేగంగా పరిగెత్తి వికెట్లను తాకించినా మార్క్రమ్‌ ఔటయ్యేవాడు. అలా బంగారం లాంటి రనౌట్‌ చాన్స్‌ మిస్‌ అయింది. అంతకముందు కోహ్లి కూడా మార్క్రమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అలా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకన్న మార్క్రమ్‌ అర్థసెంచరీతో మెరిశాడు.

చదవండి: తెలివిగా వ్యవహరించిన కార్తిక్‌.. లాస్ట్‌ మ్యాచ్‌ హీరో జీరో అయ్యాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement