
Courtesy: IPL Twitter
Mohammed Shami Stunning Throw.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ త్రోతో మెరిశాడు. షమీ వేసిన డైరెక్ట్ త్రోకు టిమ్ స్టీఫెర్ట్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కాగా స్టీఫెర్ట్‌కు ఐపీఎల్‌లోలో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో నాలుగో బంతిని స్టీఫెర్ట్ డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి అక్కడే పడడంతో పరుగు తీయాలా వద్దా అని ఆలోచించాడు. కానీ అప్పటికే దినేశ్ కార్తిక్ సగం క్రీజు దాటేయడంతో స్టీఫెర్ట్ ఆలస్యంగా పరిగెత్తాడు.అప్పటికే బంతిని అందుకున్న షమీ మెరుపు వేగంతో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది.
ఇక మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్‌కు సహకరించారు.
చదవండి: Virender Sehwag: ప్రత్యర్థి ఆటగాడిని దూషించాడు.. మనోడైనా తిట్టాడు; అది క్రీడాస్పూర్తి
Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే
Comments
Please login to add a commentAdd a comment