ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన కృనాల్ పాండ్యాను సోదరుడు హార్దిక్ పాండ్యా అభినందనల్లో ముంచెత్తాడు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది బిగ్ బ్రో’ అంటూ హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీనికి వారిద్దరు కలిసి ఉన్న ఫొటోను జత చేశాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో హార్దిక్-కృనాల్‌లు ఇద్దరూ జతగా భారత్ తరఫున తొలిసారి ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కృనాల్ ఒక వికెట్‌ను మాత్రమే సాధించినప్పటికీ అతనిపై సెలక్టర్లు మరొకసారి విశ్వాసం ఉంచారు. దాన్ని నిలబెట్టుకున్న కృనాల్..భారత విజయంలో తనదైన ముద్ర చూపించాడు.
నిన‍్నటి మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించడంతో పాటు కుదురుగా బౌలింగ్ చేసిన కృనాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో కృనాల్ రెండు వికెట్లు తీసిl కృనాల్.. మరుసటి ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. దాంతో న్యూజిలాండ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, గ్రాండ్‌హోమ్(50), రాస్ టేలర్(42)లు రాణించడంతో కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అటు తర్వాత భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. ఇంకా ఏడు బంతులు ఉండగానే గెలుపును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment