Hardik Pandya, Krunal Pandya Achieve Unique Feat In IPL 2023 - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్‌

Published Sun, May 7 2023 4:13 PM | Last Updated on Sun, May 7 2023 4:26 PM

Hardik Pandya, Krunal Pandya Achieve Unique Feat In IPL 2023 - Sakshi

pC: IPL.com

ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన సోదరులుగా హార్దిక్‌, కృనాల్‌ నిలిచారు. ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కృనాల్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌, లక్నో జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో పాండ్యా బ్రదర్స్‌ ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు. కాగా లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ఈ టోర్నీ మధ్యలో తప్పుకోవడంతో కృనాల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
చదవండి: IPL 2023: హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్‌ ఇవ్వండి! అయినా కష్టమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement