Lucknow Super Giants vs Chennai Super Kings Updates:
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..
లక్నో సూపర్‌జెయింట్స్, సీఎస్‌కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. లక్నో తొలి ఇన్నింగ్స్ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్‌జెయింట్స్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతోంది. ఆయుష్ బదోని 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
19.2: ఏడో వికెట్ డౌన్.. వర్షం ఆటంకం
పతిరణ బౌలింగ్‌లో గౌతం(1) రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరణుడి అంతరాయం కారణంగా ఆటను నిలిపివేశారు. స్కోరు 125/7 (19.2).
అర్ధ శతకంతో మెరిసిన బదోని
ఓవైపు వికెట్లు పడుతున్నా లక్నో యువ ప్లేయర్ ఆయుష్ బదోని మాత్రం పట్టుదలగా నిలబడి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 18.3 ఓవర్లో చహర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 19 ఓవర్లలో లక్నో స్కోరు: 125/6
17.4: ఆరో వికెట్ కోల్పోయిన లక్నో
20 పరుగులతో నిలకడగా ఆడుతున్న పూరన్‌ను.. మతీశ పతిరణ బోల్తా కొట్టించాడు. ఈ యువ పేసర్ బౌలింగ్లో పూరన్.. అలీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. క్రిష్ణప్ప గౌతం, ఆయుష్ బదోని (38) క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లలో లక్నో స్కోరు: 57/5
నికోలస్ పూరన్ 11, ఆయుష్ బదోని 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
9.4: ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
మొయిన్ అలీ బౌలింగ్‌లో కరణ్ శర్మ(9) బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లలో లక్నో స్కోరు: 44-5
6.5: కష్టాల్లో కూరుకుపోయిన లక్నో
చెన్నై బౌలర్లు పంజా విసరడంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో.. తాజాగా స్టొయినిస్ రూపంలో మరో వికెట్‌ను చేజార్చుకుంది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయిన స్టొయినిస్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 7 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 34-4. కరణ్ శర్మ, నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నారు.
5.5: మూడో వికెట్ డౌన్
తీక్షణ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన కృనాల్ పాండ్యా. పవర్ ప్లేలో లక్నో స్కోరు: 31/3 (6)
5.4: రెండో వికెట్ కోల్పోయిన సూపర్ జెయింట్స్
లక్నో ఓపెనర్ మనన్ వోహ్రాను బౌల్డ్ చేసిన మహీశ్ తీక్షణ. కృనాల్ పాండ్యా, కరణ్ శర్మ క్రీజులో ఉన్నారు.
3.4: తొలి వికెట్ కోల్పోయిన లక్నో
మొయిన్ అలీ బౌలింగ్‌లో మేయర్స్(14) అవుట్.
ఆసక్తికర పోరు
ఐపీఎల్-2023లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది.
కాగా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృనాల్ పాండ్యా లక్నోను ముందుండి నడిపించనున్నాడు. ఇక టాస్ సందర్భంగా చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘చిరుజల్లులు కురుస్తున్నాయి.. వికెట్ కాస్త పచ్చిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మేము ముందు బౌలింగ్ చేస్తాం.
దీపక్ చహర్ ఫిట్‌గా ఉన్నాడు. ఆకాశ్ సింగ్ స్థానంలో చహర్ జట్టులోకి వస్తున్నాడు. ఈ ఒక్కటి తప్ప మరే ఇతర మార్పులు లేవు’’ అని పేర్కొన్నాడు. చాలా మంది ఇదే తనకు చివరి ఐపీఎల్ అని ఫిక్సైపోయారని.. అయితే, తాను మాత్రం అలా భావించడం లేదని నవ్వులు చిందించాడు. కాగా గత మ్యాచ్‌లో సీఎస్‌కే చెన్నైలో లక్నోతో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సొంతమైదానంలో సీఎస్‌కేకు విజయంతో జవాబు ఇవ్వాలని భావిస్తోంది.
IPL 2023 LSG Vs CSK Playing XI తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ
Comments
Please login to add a commentAdd a comment