ధోనితో కృనాల్ పాండ్యా (PC: Lucknow Super Giants Twitter)
IPL 2023 LSG Vs CSK- Krunal Pandya: కేఎల్ రాహుల్ గాయపడిన కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్ అయ్యాడు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. అయితే, కెప్టెన్ అయ్యానన్న ఆనందం కృనాల్‌కు ఎంతో సేపు నిలవలేదు.
అంతలోనే ఆనందం ఆవిరి
లక్నో బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే అతడి సంతోషం ఆవిరైపోయింది. కృనాల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సీఎస్‌కేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
చెత్త రికార్డు మూటగట్టుకుని
ఈ క్రమంలో చెన్నై బౌలర్ మొయిన్ అలీ.. ఓపెనర్ కైల్ మేయర్స్(14)ను పెవిలియన్‌కు పంపగా.. మహీశ్ తీక్షణ మరో ఓపెనర్ మనన్ వోహ్రా(10) వికెట్ కూల్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరణ్ శర్మ 9 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు.
లక్నో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతికి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తద్వారా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్‌గా అప్రదిష్ట మూటగట్టుకున్నాడు.
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయింది వీరే!
►2008లో కేకేఆర్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో దెక్కన్ చార్జర్స్ కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్
►2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నాయకుడు ఎయిడెన్ మార్కరమ్
►2023లో లక్నోలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కృనాల్ పాండ్యా
చదవండి: 'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్
Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు!
Comments
Please login to add a commentAdd a comment