కేఎల్ రాహుల్ (PC: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంఛైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధివిధానాలపై బీసీసీఐ స్పష్టతనిచ్చిన తర్వాత ఇందుకు సంబంధించి లక్నో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా విఫలం
కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నో జట్టుకు ఆది నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో టీమ్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆటగాడిగా 520 పరుగులతో పర్వాలేదనపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.
లక్నోతోనే రాహుల్.. కానీ
ఈ క్రమంలో లక్నో ఈసారి పద్నాలుగింట కేవలం ఏడు మాత్రమే గెలిచి ఏడోస్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంక బహిరంగంగానే రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు రాగా.. సోమవారం సంజీవ్ గోయెంకాతో భేటీ అయిన రాహుల్ తాను జట్టుతోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.
రేసులో ఆ ఇద్దరు
ఈ క్రమంలో లక్నో జట్టు సంబంధిత వర్గాలు వార్తా సంస్థ IANSతో ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘సీఈఓ సంజీవ్ గోయెంకాతో రాహుల్ అధికారికంగానే భేటీ అయ్యాడు. రిటెన్షన్ గురించి చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది కెప్టెన్‌గా ఉండటానికి రాహుల్ విముఖత చూపాడు. బ్యాటర్‌గా తాను మరింతగా రాణించేందుకు సారథ్య బాధ్యతలు వదులుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి రాహుల్ కెప్టెన్సీ పట్ల గోయెంకాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, తను మాత్రం అందుకు సిద్ధంగా లేడు.
లక్నో రాహుల్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే, కెప్టెన్‌గా ఉండడు. బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇప్పటికి కెప్టెన్సీ రేసులో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఉన్నారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీతో కేఎల్ రాహుల్ బిజీ కానున్నాడు.
చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment