కృనాల్, నాయర్లపై దృష్టి! | Spotlight on Krunal For Zimbabwe, Iyer for Windies Tour | Sakshi
Sakshi News home page

కృనాల్, నాయర్లపై దృష్టి!

Published Sun, May 22 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

కృనాల్, నాయర్లపై దృష్టి!

కృనాల్, నాయర్లపై దృష్టి!

వచ్చే నెలలో జింబాబ్వే పర్యటన చేపట్టనున్న భారత క్రికెట్ జట్టులో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి.

ముంబై: వచ్చే నెలలో  జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టులో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ ఐపీఎల్ సీజన్లో రాణించిన కృనాల్ పాండ్య, కరుణ్ నాయర్లపై భారత క్రికెట్ సెలక్టర్లు దృష్టి సారించారు.  జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టును సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ ఇద్దరి క్రికెటర్ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి.

మరోవైపు జింబాబ్వే టూర్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతి కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ధోని విశ్రాంతి కోరితే, జింబాబ్వే టూర్ లో భారత జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లకు జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వెస్టిండీస్ పర్యటనలో నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడనున్న భారత జట్టుకు విరాట్ కోహ్లి నేతృత్వం వహిస్తాడు.ఇదిలా ఉండగా,  మరో యువ క్రికెటర్ శ్రేయస్ ఐయ్యర్ ను వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement