
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజా ఐపీఎల్ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అతడిపై మాజీ ఆటగాళ్ల ప్రశంసిస్తున్నారు. తాజాగా తన తమ్ముడు హార్దిక్‌పై కృనాల్ పాండ్యా ప్రశంసలు జల్లు కురిపించాడు. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ రాణించడంతో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ.. గాయాలు, వివాదాలతో క్రికెట్‌కు దూరమైనప్పుడు హార్దిక్ పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడని తెలిపాడు. ముఖ్యంగా అతడిపై స్పల్పకాలిక నిషేధంలో కుంగిపోకుండా మరింత రాటుదేలాడని ప్రశంసించాడు.
‘కేవలం ఆటలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ హర్దిక్ చాలా గొప్పవాడు. అందుకే హార్దిక్ నా తమ్ముడు అయినందుకు చాలా గర్వపడుతున్నా. నిజాయితీగా చెప్పాలంటే హార్దిక్‌లా నీతిగా ఉండే క్రికెటర్లు చాలా తక్కువమంది ఉంటారు. అతడెప్పుడు తన ఆటలో ఈ రోజుకు రేపటికి తేడా ఉండాలనుకుంటాడు. దానికనుగుణంగా నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. కెరీర్ మొదట్లో కేవలం స్పిన్ బౌలింగ్‌లోనే అటాక్ చేసేవాడు. కానీ ప్రస్తుతం పేస్ బౌలింగ్‌ను కూడా చీల్చిచెండటం నేర్చుకున్నాడు. అందుకే ఐపీఎల్‌లో స్టార్ పేసర్ల బౌలింగ్‌లోనూ అలవోకగా పరుగులు రాబడుతున్నాడు. మన మొదటి ప్రాధాన్యత క్రికెట్ అనే విషయాన్ని హార్దిక్‌కు ఎప్పుడూ చెబుతూ ఉంటా. అందుకే క్రికెట్ కోసం కష్టపడుతూనే ఉంటాం’అంటూ హార్దిక్‌పై తనకున్న నమ్మకాన్ని, అనుబంధాన్ని కృనాల్ పాండ్యా వ్యక్తపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment