బ్రిస్బేన్: ‘కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్లు’ తొలి టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా అనూహ్య పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోహ్లి సేన పరాజయానికి గల కారణాలను క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సెలక్షన్ విధానంపై, ఆటగాళ్ల తప్పిదాలపై మండిపడుతున్నారు. తాజాగా భారత సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి టీ20లో ప్రొఫెషనల్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కాదని ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడంపై మండిపడ్డాడు. తొలి టీ20లో కుల్దీప్ యాదవ్‌కు తోడుగా చహల్ ఉంటే ఆసీస్ బ్యాట్స్‌మెన్ మరింత ఇబ్బందులకు గురయ్యేవారని భజ్జీ అభిప్రాయపడ్డాడు. (‘మంకీ గేట్ వివాదంతో తాగుబోతునయ్యా’)
కృనాల్ నాణ్యమైన స్పిన్నర్ కాదు
ఆసీస్ పిచ్‌లపై కృనాల్ రాణించలేడని ఈ మాజీ ముంబై ఇండియన్స్ ఆటగాడు పేర్కొన్నాడు. అసలు కృనాలు సరైన స్పిన్నర్ కాదని, బంతిని స్పిన్ చేయలేడని, కేవలం వేగంగా మాత్రమే బంతులు విసురుతాడని విమర్శించాడు. ఇక ఆరోస్థానంలో బ్యాటింగ్ కోసం నాణ్యమైన స్పిన్నర్‌ను పక్కకు పెట్టి కృనాల్‌ను జట్టులోకి తీసుకోవడం ఘోర తప్పిదమన్నాడు. కృనాల్‌ను ఏ ఉద్దేశంతో జట్టులోకి తీసుకున్నారో టీమ్ మేనేజ్‌మెంట్‌కైనా క్లారిటీ ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక శుక్రవారం జరిగే రెండో టీ20లోనైనా కృనాల్‌ను తప్పించి చహల్‌కు అవాకాశం ఇవ్వాలని సూచించాడు. (ధావన్, కార్తీక్ పోరాటం వృథా)
అంబటి రాయుడిని తీసుకోవాలి
బ్యాటింగ్ మార్పులపై కూడా అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో కాకుండా, కేఎల్ రాహుల్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఆసీస్‌కు కలిసొచ్చిందన్నాడు. నాలుగో స్థానం రాహుల్‌కు తగదనుకుంటే అతడిని పక్కకు పెట్టి అంబటి రాయుడుని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానానంలో రాయుడు సెట్ అయ్యాడని, టీ20ల్లో కూడా ఆ స్థానంలో రాణిస్తాడనే నమ్మకముందన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంపకప్ దృష్ట్యా స్పిన్నర్లపై సెలక్టర్లు ఓ అభిప్రాయానికి రావాలని సూచనలిచ్చాడు. చహల్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటే ఆసీస్ పర్యటనలో తగినన్ని అవకాశాలివ్వాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. (ఆసీస్ 158, భారత్ 169.. విజేత?)
Comments
Please login to add a commentAdd a comment