Ind Vs Eng 1st ODI: Krunal Pandya Got Emotional About His Father, Video Goes Viral - Sakshi
Sakshi News home page

భావోద్వేగానికి లోనైన కృనాల్‌ పాండ్యా

Published Tue, Mar 23 2021 3:27 PM | Last Updated on Tue, Mar 23 2021 5:11 PM

Krunal Pandya Remembers His Father After Receiving ODI Cap From Hardik Pandya - Sakshi

పుణే: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సోదరుడు కృనాల్‌ పాండ్య వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో కృనాల్‌తోపాటు కర్ణాటక పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ కూడా వన్డే క్యాప్‌ అందుకున్నారు. ప్రసిద్ద్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కాగా, కృనాల్‌ ఇప్పటికే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

కాగా, ఈ ఏడాది ఆరంభంలో పాండ్య సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ్ముడు హార్దిక్‌ నుంచి క్యాప్‌ అందుకున్న కృనాల్‌.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. హార్డిక్‌.. తన అన్నను హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాగా, పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) ఈ ఏడాది జనవరి 16న కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement