రెండోసారి తండ్రైన పాండ్యా | IPL 2024: LSG All Rounder Krunal Pandya Blessed With A Baby Boy, Named Vayu | Sakshi
Sakshi News home page

రెండోసారి తండ్రైన పాండ్యా

Published Fri, Apr 26 2024 6:10 PM | Last Updated on Fri, Apr 26 2024 6:49 PM

IPL 2024: LSG All Rounder Krunal Pandya Blessed With A Baby Boy, Named Vayu

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యా రెండో సారి తండ్రయ్యాడు. ఈ నెల 21 కృనాల్‌ భార్య పంఖురి శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు 'వాయు' అని నామకరణం చేసినట్లు కృనాల్‌ తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు. బిడ్డ పేరుతో (వాయు కృనాల్‌ పాండ్యా) పాటు పుట్టిన తేదీని (21.4.24) కృనాల్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

 

 

కృనాల్‌-పంఖురి శర్మ దంపతులకు ఇదివరకే ఓ మగబిడ్డ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కవిర్‌ కృనాల్‌ పాండ్యా. కవిర్‌ 2022 జులై 24న జన్మించాడు. ప్రముఖ మోడల్‌ అయిన పంఖురితో కృనాల్‌కు 2017లో వివాహమైంది. కృనాల్‌ సోదరుడు హార్దిక్‌కు కూడా ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అగస్త్య. అగస్త్య.. హార్దిక్‌-సటాషా స్టాంకోవిచ్‌ దంపతులకు జన్మించిన సంతానం.

ఇదిలా ఉంటే, కృనాల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఈ సీజన్‌లో కృనాల్‌ 8 మ్యాచ్‌ల్లో 58 పరుగులు చేసి, 5 వికెట్లు పడగొట్టాడు. కృనాల్‌ జట్టు లక్నో ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో కృనాల్‌కు  బ్యాటింగ్‌ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. బంతితో మాత్రం వచ్చిన అవకాశాలను కృనాల్‌ సద్వినియోగం చేసుకున్నాడు.

ఈ సీజన్‌లో కృనాల్‌ ప్రదర్శనలు..

  • రాజస్థాన్‌పై (4-0-19-0, 3 నాటౌట్‌)

  • పంజాబ్‌పై (43 నాటౌట్‌, 3-0-26-0)

  • ఆర్సీబీపై (0 నాటౌట్‌, 1-0-10-0)

  • గుజరాత్‌పై (2 నాటౌట్‌, 4-0-11-3)

  • ఢిల్లీపై (3, 3-0-45-0)

  • కేకేఆర్‌పై (7 నాటౌట్‌, 1-0-14-0)

  • సీఎస్‌కేపై (3-0-16-2)

  • సీఎస్‌కేపై (2-0-15-0)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement