
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యశ్. బాలీవుడ్‌తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్‌లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్‌తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్‌తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment