ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లక్నో వెల్లడించింది. పూరన్‌కు నెం 29తో కూడిన వైస్ కెప్టెన్ జెర్సీని లక్నో సారథి కేఎల్ రాహుల్ అందించాడు.
కాగా గత రెండు సీజన్లలో రాహుల్ డిప్యూటీగా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్ధానాన్ని పూరన్ భర్తీ చేయనున్నాడు. ఇక నికోలస్ పూరన్ ప్రస్తుతం టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన యూఏఈ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా ఐపీఎల్-2023 వేలంలో పూరన్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: స్ట్రైక్‌రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి?
🚨BREAKING🚨: Lucknow Super Giants have appointed Nicholas Pooran as the vice-captain for IPL 2024.
— CricTracker (@Cricketracker) February 29, 2024
📸: LSG#IPL2024 #LSG pic.twitter.com/ZYtiqVm0Eb
Comments
Please login to add a commentAdd a comment