IPL 2022 GT vs LSG: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్‌ గెలిచాం కదా! | IPL 2022 GT vs LSG: Krunal Pandya Wittily Avoids Celebrate Hardik Wicket Viral | Sakshi
Sakshi News home page

Krunal Pandya Vs Hardik Pandya: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్‌ గెలిచాం కదా!

Published Tue, Mar 29 2022 10:51 AM | Last Updated on Tue, Mar 29 2022 11:23 AM

IPL 2022 GT vs LSG: Krunal Pandya Wittily Avoids Celebrate Hardik Wicket Viral - Sakshi

హార్దిక్‌ పాండ్యా- కృనాల్‌ పాండ్యా(PC: Disney+Hotstar)

Krunal Pandya Vs Hardik Pandya- Video Viral: తోడబుట్టిన అన్నదమ్ములు... అంతకుముందు జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ ఒకే జట్టుకు ఆడారు.. అలాంటిది తాజా సీజన్‌తో ఒక్కసారిగా ‘ప్రత్యర్థులు’గా మారిపోయారు. నువ్వా- నేనా అంటూ పోటీ పడ్డారు. అయితే, ఇద్దరినీ ‘విజయం’ వరించింది. అన్నకు వికెట్‌ రూపంలో అదృష్టం కలిసి వస్తే.. తమ్ముడు ఏకంగా మ్యాచ్‌ గెలిచేశాడు. ఈ ప్రస్తావనంతా పాండ్యా బ్రదర్స్‌ గురించే!

టీమిండియా ఆటగాళ్లైన హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఐపీఎల్‌-2022 సీజన్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లకు! హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ కాగా.. కృనాల్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడుతున్నాడు.

ఇక సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్యం ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్‌ సారథి హార్దిక్‌.. తన అన్న కృనాల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 11వ ఓవర్‌ మొదటి బంతికే మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 

అయితే, ఆ సమయంలో హార్దిక్‌ నిరాశగా వెనుదిరగగా.. కృనాల్‌ పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు... ‘‘అరె చోటే(తమ్ముడు)... సారీ రా..! నన్ను క్షమించురా అన్నట్లుగా పాపం కృనాల్‌ ముఖం దాచుకున్నాడు. అయినా ఆటలో ఇవన్నీ సహజమే కదా! లైట్‌ తీసుకోవాలి బ్రదర్‌! అయినా మీ తమ్ముడు మ్యాచ్‌ గెలిచాడుగా’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది విజయంతో అరంగేట్రం చేసింది.

చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్‌ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్‌ పాండ్యా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement