
లక్నో జెర్సీలో హార్దిక్ పాండ్యా తనయుడు అగస్త్య(PC: Krunal Pandya Twitter)
లక్నో జెర్సీలో హార్దిక్ పాండ్యా కుమారుడు.. ఫొటో వైరల్
IPL 2022 LSG Vs GT: టీమిండియా ఆటగాళ్లు, పాండ్యా సోదరులు కృనాల్- హార్దిక్ ఐపీఎల్-2022లో వేర్వేరు జట్లకు ఆడుతున్న విషయం తెలిసిందే. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరు అన్నదమ్ములు తాజా ఎడిషన్‌లో కొత్త ఫ్రాంఛైజీల్లో భాగమయ్యారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడు కాగా.. కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నాడు.
ఇక అరంగేట్రంలోనే అదరగొడుతున్న ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్‌లలో చెరో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించాయి. అయితే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న లక్నో పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. గుజరాత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పాండ్యా బృందం, రాహుల్ సేన మంగళవారం తలపడనున్నాయి.
కాగా గత మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగా.. ఈసారి ఎలాగైనా పైచేయి సాధించాలని లక్నో భావిస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ పాండ్యా ఆసక్తికర ట్వీట్ చేశాడు. హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ఫొటోలు షేర్ చేసిన అతడు.. ‘‘ఈసారి నా లక్కీ చార్మ్ నా వైపు ఉన్నాడు’’ అని కామెంట్ చేశాడు. కాబట్టి విజయం తమనే వరిస్తుందని పరోక్షంగా పేర్కొన్నాడు.
ఇందులో చిన్నారి అగస్త్య లక్నో జెర్సీ ధరించి ఉండటం చూసిన అభిమానులు.. ‘‘క్యూట్‌గా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ బ్రో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
చదవండి👉🏾Rohit Sharma: బుమ్రా స్పెషల్.. అది ముందే తెలుసు.. అయినా చెత్త ప్రదర్శన.. అంతా వాళ్లే చేశారు!
Got my lucky charm on my side for tomorrow’s game @hardikpandya7 😉 pic.twitter.com/OiDfEMHeHJ
— Krunal Pandya (@krunalpandya24) May 9, 2022