
ముంబై : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌కే పరిమితమైన ఆటగాళ్లు నచ్చిన పని చేస్తూ గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాండ్యా బ్రదర్స్ ఎప్పటికప్పుడు తాము చేసే పనులను షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరు తమ బెడ్‌రూంలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియో ఒకటి షేర్ చేశారు. బెడ్‌కు ఇరువైపులా హార్ధిక్ , కృనాల్ పాండ్యాలు నిలబడి టేబుల్ టెన్నిస్ ఆడారు. కృనాల్ వీడియోనూ షేర్ చేస్తూ.. 'మేము ఈరోజు సరికొత్త టేబుల్ టెన్నిస్ ఆడాము. బెడ్‌షీట్‌ను నెట్‌గా మార్చుకొని చేతులనే బ్యాట్‌గా భావించి ఆడాము. మీకు తెలుసుగా.. నా తమ్ముడు ఉంటే ఇలాంటి చిలిపి ఆలోచనలే వస్తాయి. ఇది కూడా వాడి ప్లానే.. అయితే గేమ్‌ను మాత్రం కాంపిటేటివ్‌గానే ఆడాం.. ఈ రౌండ్‌లో ఎవరు గెలుస్తారో మీరో చెప్పండి అంటూ' క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.
(వైరల్ : నీ ఏకాగ్రతను మెచ్చుకోవాల్సిందే)
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి పాండ్యా బ్రదర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం హార్ధిక్.. 2011లో తన సోదరుడు కృనాల్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది సెప్టెంబర్‌లో వెన్నునొప్పితో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment