Watch: Pandya Brothers Dancing With Their Wives Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

భార్యలతో అదరగొట్టిన పాండ్యా బ్రదర్స్‌.. వీడియో వైరల్‌

Published Tue, Apr 20 2021 4:59 PM | Last Updated on Tue, Apr 20 2021 7:18 PM

IPL 2021: Pandya Brothers Shakes Leg With Their Partners Became Viral - Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఓడిన ముంబై ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉంది.  అదే ఉత్సాహంతో నేడు ముంబై ఇండియన్స్‌  ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విషయం పక్కనపెడితే..  ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యులుగా ఉన్న పాండ్యా బ్రదర్స్‌ ఎంటర్‌టైన్‌ అందించడంలో ముందుంటారు. తాజాగా పాండ్యా బ్రదర్స్‌ తమ భార్యలు నటాషా స్టాంకోవిక్‌, పంకూరీ శర్మలతో కలిసి చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నదమ్ములైన హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఒకేరకమైన డ్రెస్‌ వేసుకోగా..  హార్దిక్‌ భార్య నటాషా.. కృనాల్‌ భార్య పంకూరీ శర్మ వైట్‌, బ్లాక్‌ కాంబినేషన్‌ వేసుకున్నారు. దానికి పాండ్యా స్వాగ్‌ అని పేరు పెట్టి బ్యాక్‌ అండ్‌ ఫార్వార్డ్‌ డ్యాన్స్‌స్టెప్స్‌తో దుమ్ములేపారు. దీనికి సంబంధించిన వీడియోనూ హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన షూపై ఏదో ఒక​ అంశాన్ని రాసుకొని అవగాహన కల్పించడం కూడా బాగా వైరలైంది. 
చదవండి: అతను బంతితో మ్యాజిక్‌ చేయడం చూడాలి

బౌలర్‌ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్‌ దాటితే మాత్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement