
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ పని వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్‌దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు తెలిసింది.
బేడి ఖాతాలో టర్కిష్, ఆంగ్ల భాషల్లో ట్వీట్లతో పాటు టర్కీ జెండా ఎమోజి కనిపించింది. ‘మా సోషల్ మీడియా అకౌంట్లను మూసివేస్తున్నందుకు నిరసన తెలుపుతున్నాం. మాపై నిషేధాన్ని తొలగించే వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖాతాలకు ముప్పు తప్పదు’ అని టర్కిష్ భాషలో ట్వీట్ వచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని ట్వీటర్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment