అసోం కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా బుధవారం హ్యాక్ అయింది. ప్రొఫైల్ పేరు 'టెస్లా ఈవెంట్'గా మారిపోయింది. ప్రొఫైల్ ఫొటోగా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా లోగోను పెట్టారు హ్యాకర్లు.
ఈ మేరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాతా హ్యాక్‌కు గురైందని ఏపీసీసీ సోషల్ మీడియా & ఐటీ చైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని, ఇప్పుడే పునరుద్ధరించామని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. పూర్తి భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమీక్షలో ఉందని పేర్కొంది. ఇది ప్రభుత్వ పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
We would like to inform you that our official Twitter handle, Assam Pradesh Congress Committee, was hacked but has now been restored and is currently under review to ensure full security. This attempted silencing by the fascist government will not deter us. We remain committed to… pic.twitter.com/DE7vWGXWcv
— Tesla Event (@INCAssam) May 8, 2024
Comments
Please login to add a commentAdd a comment