
సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు హ్యాకర్లు.. ఖాతాల్ని తమ అధీనంలోకి తీసుకుంటూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ నయనతార ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)
సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే నయనతార ఇన్ స్టాలో పెద్దగా పోస్టులేం పెట్టదు. కాకపోతే పిల్లలు, భర్తతో ఉన్న ఫొటోల్ని ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటుంది. ట్విటర్‌లోనూ అడపాదడపా పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ట్విటర్లోనే రాసుకొచ్చింది. తన అకౌంట్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వొద్దని పేర్కొంది.
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని పెళ్లి చేసుకున్న నయనతార.. సరోగసి విధానంలో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీతోనూ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఈమె చేతిలో తని ఒరువన్ 2, టెస్ట్, మన్నన్ గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ అనే మూవీస్ ఉన్నాయి. తెలుగులో అయితే చివరగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో కనిపించింది.
(ఇదీ చదవండి: ఈ చెత్త పనేంటి దర్శన్.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?)
Account has been hacked. Please ignore any unnecessary or strange tweets being posted.
— Nayanthara✨ (@NayantharaU) September 13, 2024