ఈ చెత్త పనేంటి దర్శన్‌.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..? | Darshan Shows Middle Finger To Media At Ballari Jail | Sakshi
Sakshi News home page

ఈ చెత్త పనేంటి దర్శన్‌.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?

Published Fri, Sep 13 2024 4:52 PM | Last Updated on Fri, Sep 13 2024 6:28 PM

Darshan Shows Middle Finger To Media At Ballari Jail

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న  కన్నడ నటుడు దర్శన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మీడియా పట్ల అసభ్య రీతిలో ప్రవర్తించాడు.  బళ్లారి సెంట్రల్‌ జైల్లో ఉన్న దర్శన్‌ను కలుసుకునేందుకే ఆయన కుటుంబ సభ్యులు తాజాగా వచ్చారు.  భార్య విజయలక్ష్మి, సోదరుడు దినకర్, లాయర్‌ సునీల్‌ జైలుకు చేరుకొని ములాఖత్‌ అయ్యారు, అర్ధగంటకు పైగా విడివిడిగా మాట్లాడారు. ఈ క్రమంలో దర్శన్‌కు డ్రైఫ్రూడ్స్, బిస్కెట్లు, దేవుని ప్రసాదం ఆమె అందజేశారు.

జైలు ఆవరణలో లాయర్‌తో మాట్లాడేందుకు దర్శన్‌ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కన్నడ మీడియా ఆయన్ను కవరేజ్‌ చేసింది. అదేదో నేరం అయినట్లుగా మీడియా సిబ్బందికి మిడిల్‌ ఫింగర్‌ను చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. సుమారు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ దర్శన్‌కు ఏమాత్రం అహం తగ్గలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదో గొప్పగా సాధించి జైలుకు ఏమైనా పోయావా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరికొందరైతే దర్శన్‌ ట్రాక్‌ రికార్డ్‌ అంతా వివాదస్పందంగానే ఉంటుందని చెబుతున్నారు. తన భార్యతో గొడవపడి గతంలో కూడా జైలుకెళ్లాడు.. ఆపై ఓ రెస్టారెంట్‌లో దాడికి పాల్పడి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాడు.. తన మేనేజర్‌ మిస్సింగ్‌ కేసులో దర్శన్‌ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆయన చుట్టూ వివాదాలే ఉన్నాయంటూ కొందరు గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్య సంజ్ఞలే చేస్తారంటూ పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్‌ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?

ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లతో ఇబ్బందిపెడుతున్నాడని అభిమాని రేణుకాస్వామిని దర్శన్‌ చంపించారని ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అనంతరం  3,991 పేజీలతో  ఛార్జిషీట్ రెడీ చేసి కోర్టుకు అందించారు. రేణుకాస్వామిని దర్శన్‌ కాలితో తన్నాడమే కాకుండా పవిత్ర గౌడకు చెప్పులు ఇచ్చి కొట్టిపించాడని ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement