
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి శనివారం తెలియజేశారు. దుండగులు తన అకౌంట్‌ను హ్యాక్ చేసి నేర సంబంధితమైన సమాచారాన్ని తన ప్రమేయం లేకుండా పోస్ట్ చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ట్విట్టర్‌లో తనని అనుసరించే వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతున్నట్లు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు.