
న్యూఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన ట్విట్టర్ ఖాతా శనివారం(జనవరి 22) రోజున కొద్దిసేపు హ్యాక్ అయినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. "ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ హ్యాండిల్ జనవరి 22న హ్యాకర్స్ హ్యాక్ చేశారు. సాంకేతిక నిపుణులు ఈ సమస్యను పరిశీలిస్తున్నారని" అని డిజీ కర్వాల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
'@NDRFHQ ట్విటర్ హ్యాండిల్ ద్వారా హ్యాకర్స్ కొన్ని యాదృచ్ఛిక సందేశాలను పోస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను కొద్ది సేపు హ్యాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు.
(చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!)