
మెక్సికొ : మనం రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చూస్తుంటాం.. అందులో కొన్ని వీడియోలు మాత్రం కంటతడి పెట్టిస్తుంటాయి. తాజాగా మెక్సికొలో జరిగిన ఒక సంఘటన ఇదే విధంగా ఉంది. మెక్సికొకు చెందిన 16 ఏళ్ల అలెగ్జాండర్ మార్టినేజ్‌కు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. తన ఫుట్‌బాల్ టీమ్‌తో కలిసి ఎక్కువగా మైదానంలోనే గడిపేవాడు. కాగా గత బుధవారం అలెగ్జాండర్ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. అలెగ్జాండర్ లేడన్న నిజం తెలుసుకున్న అతని స్నేహితులు ఘనమైన నివాళి ఇవ్వాలని అనుకున్నారు. కాగా అంత్యక్రియలకు ముందు చివరిసారి వీడ్కోలు పలికేందుకు అలెగ్జాండర్ ఉన్న శవపేటికను ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు తీసుకువచ్చారు. గోల్ఫ్‌కు ఎదురుగా శవపేటికను నిలిపి టీమ్ సభ్యులంతా వరుసగా నిలబడ్డారు. ఒకరు ఫుట్‌బాల్‌ను కిక్ చేయగా అది వెళ్లి అలెగ్జాండర్ ఉన్న శవపేటికకు తగిలి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. అంతే.. ఒక్కసారిగా అలెగ్జాండర్ ఉన్న శవపేటికను చుట్టముట్టి భోరున విలపించారు.
'ఇంతకాలం మాతో పాటు కలిసి తిరిగిన వాడు ఇక లేడన్న వార్త జీర్ణించుకోలేకపోయాం.. అంతేకాదు అలెగ్జాండర్‌కు ఫుట్‌బాల్ అంటే ప్రాణం.. అందుకే ఇలా చేశాం' అంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 54 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. కాగా 16 ఏళ్ల అలెగ్జాండర్ హత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment