ముగ్గురు డాన్స్‌.. కానీ ఒక్కరే! | Raveena Tandon Shares 3 Men Dance Video In Social Media | Sakshi
Sakshi News home page

అద్భుతం.. డ్యాన్స్‌ ఇరగదీశాడు!

Published Sat, Jul 25 2020 5:15 PM | Last Updated on Sat, Jul 25 2020 5:28 PM

Raveena Tandon Shares 3 Men Dance Video In Social Media - Sakshi

ముంబై: సాధారణంగా ఎదైనా వస్తువును ఉపయోగించి డ్యాన్స్‌ చేయడం వంటివి డ్యాన్స్‌ షోల్లో చూస్తుంటాం. అది కూడా డ్యాన్సర్‌లకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఓ ముగ్గురు వ్యక్తులు ఫుట్‌బాల్‌ను ఉపయోగించి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ శనివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. రెండేళ్ల క్రితం నాటి వీడియో అయినప్పటికీ తాజాగా రవీనా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ‘అవును మాకు ప్రతిభ ఉంది! ఇది చాలా అద్భుతం! చాలా బాగా చేశారు బాయ్స్‌! మీరు ఎక్కడ ఉన్నా ఈ ట్వీట్‌ మీకు చేరుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. (చదవండి: వైరల్ : ఈ డస్ట్‌ బిన్‌కు ఏమైందబ్బా!)

ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘అద్భుతం’, ‘లుంగీతో ఫుట్‌బాల్‌ డ్యాన్స్‌ సూపర్‌’, ‘ఆశ్చర్యం.. ఫ్రీ స్టైల్‌ ఫుట్‌బాలర్స్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో గ్రూప్‌ డ్యాన్స్‌ చేస్తున్న ముగ్గురిలో ఒకరు లుంగితో, మరోకరు స్సోర్ట్స్‌ డ్రెస్‌లో, ఇంకొకరు ఫార్మల్‌లో దుస్తులు ధరించి కనిపించారు. ముగ్గురు ఒకే సింక్‌లో బాల్‌తో స్టెప్పులేస్తు‍న్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  అయితే అందరిని ఆశ్చర్యపరిచే  విషయం  ఏంటంటే వీడియోలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక్కరే. అతడి పేరు ప్రదీప్‌ రమేష్‌. ఫుట్‌బాల్‌ జీనియస్‌ వరల్డ్‌ రికార్డు టైటిల్‌ను సాధించిన తమిళనాడుకు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement