వీడియో దృశ్యం
చెన్నై : పోలీసులు వాహనాలను ఆపటం చాలా సాధారణమైన విషయం. అయితే తమిళనాడుకు చెందిన ఓ పోలీస్ బైకర్ ఆపటానికి ఓ మంచి కారణమే ఉంది. ఆ కారణం తెలిస్తే ఆయనకు చేతులెత్తి దండ పెడతారు. ఇంతకీ విషయమేంటంటే!.. కొద్దిరోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఆనీ అరుణ్ అనే ట్రావెల్ యూట్యూబర్ పాండిచ్చేరి నుంచి తెన్‌కాశీకి బయలుదేరి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు.
ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్‌కు యూట్యూబర్‌కు మధ్య జరిగిన సంభాషణ...
పోలీస్ కానిస్టేబుల్ : ఏ ఊరు, కర్ణాటకానా?
బైకర్ : అవును! కర్ణాటకా అన్న..
పోలీస్ కానిస్టేబుల్ : (చేయి చూపిస్తూ) ముందు ఓ గవర్నమెంట్ బస్ పోతోంది.
బైకర్ : ఆ!!
పోలీస్ కానిస్టేబుల్ : (వేరే గవర్నమెంట్ బస్‌ను చూపిస్తూ ) ఇలాంటి బస్ ఒకటి వెళుతోంది. అందులో ఓ అమ్మ! మందు మరిచిపోయి పోయింది. ఆమెకు ఈ మందు ఇవ్వు (ఓ బాటిల్ బైకర్ చేతిలో పెడుతూ). తర్వాతి స్టాప్‌లో ఆమె దిగుతుంది.
బైకర్ : ఆ! సరే!!
పోలీస్ కానిస్టేబుల్ : ఇదిగో! ఇలాంటి గవర్నమెంట్ బస్( అతడి వెనకాల రోడ్డుపై వెళుతున్న బస్‌ను చూపెడుతూ)
బైకర్ : సేమ్ బస్సా!
పోలీస్ కానిస్టేబుల్ : సేమ్ బస్! ఇదిగో ఇటు వెళుతోంది. మందు ఇచ్చేయ్యండి! పోండి.. పట్టుకోవచ్చు.
బైకర్ : థాంక్యూ! చెప్పి అక్కడినుంచి ముందుకు కదిలాడు.
బైక్‌ను వేగంగా పోనిచ్చి ఓ బస్‌ను పట్టుకున్నాడు. డ్రైవర్‌కు బస్ ఆపమని సంజ‍్క్షలు చేసి.. బైక్‌ను ఇంకా ముందుకు పోనిచ్చి ఆపాడు. ఆ తర్వాత వెనకాలే వచ్చిన బస్సు కూడా బైక్ దగ్గర ఆగింది. అతడు మందు బాటిల్ ఆమెకు ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మీ ఇద్దరు మానవత్వానికి న్యాయం చేశారు’’.. ‘‘ ఇదో మనసు మెప్పించే వీడియో’’.. ‘‘ నిజంగా ఆ పోలీసుకు చేతులెత్తి దండం పెట్టాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment