రణరంగాన్ని తలపించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. ముష్టి యుద్ధానికి దిగిన అభిమానులు | Rival Fans Clash At Mexico Football Match, 22 Injured | Sakshi
Sakshi News home page

Clash At Mexico Football Match: రణరంగాన్ని తలపించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. ముష్టి యుద్ధానికి దిగిన అభిమానులు

Published Mon, Mar 7 2022 4:02 PM | Last Updated on Mon, Jun 6 2022 1:33 PM

Rival Fans Clash At Mexico Football Match, 26 Injured - Sakshi

Rival Fans Clash At Mexico Football Match: మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్‌ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు. మ్యాచ్‌ ప్రారంభంమైన కొద్ది నిమిషాలకే ఇరు జట్ల అభిమానులు దాడులకు దిగడంతో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కుర్చీలు, పిడిగుద్దులతో అభిమానులు ఒకరిపై ఒకరు విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డారు. 


కుటుంబాలు, చిన్న పిల్లలతో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన కొందరు పరిస్థితి చూసి భయాందోళనలకు గురై చెల్లాచెదురైపోయారు. దీంతో చేసేదేమీ లేక నిర్వహకులు మ్యాచ్‌ను నిలిపేశారు. ఈ గొడవలో 22 మంది గాయపడగా, 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరు జట్ల అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవ తన్నులాటకు దారితీసిందని తెలుస్తోంది.  కాగా ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య( ఫిఫా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు ఆదేశించింది.



చదవండి: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement