fans clash
-
అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్
తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తిగా.. సినీ రంగంలో నటుడు అజిత్కంటూ ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయనకు అభిమాన గణం చాలా ఎక్కువే ఉంది. అయినా అభిమాన సంఘాలు వంటివి వద్దని స్ట్రిక్ట్‌గా హెచ్చరిస్తారు. ఇక తనకు ఇష్టమైన మోటారు బైక్ రేస్, రైఫిల్ షూట్ వంటి విషయలపై ఆసక్తి చూపుతారు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలపైనా స్పందించరు. మరో స్టార్ నటుడు విజయ్. ఈయన చాలా కూల్‌గా తన పని తాను చేసుకుపోయే నటుడు. అయితే విజయ్ తన అభిమానులను ప్రోత్సహిస్తారు. వారిని సేవా కార్యక్రమాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. కాగా విజయ్, అజిత్ మధ్య వృత్తి పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంది. వీరు కలుసుకునేది అరుదే అయినా ఆ సమయంలో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారు. అయితే వారి అభిమానులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తమ హీరో గ్రేట్.. తమ హీరో తోపు అంటూ వాదించుకుంటారు. ఇక తమ అభిమాన హీరోల చిత్రాల విడుదల సమయంలో వీరు చేసే హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఈ హీరోని ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అయితే వారి అభిమానుల మధ్య జరిగే యుద్ధం అంతా ఇంతా కాదు. దీంతో సాధారణంగా విజయ్, అజిత్ సినిమాలు ఒకేసారి విడుదల కాకుండా చూసుకుంటారు. చదవండి: (మీకు నయన్ సూపర్‌స్టార్ గానే తెలుసు..: విఘ్నేష్ శివన్) అయితే విజయ్ హీరోగా నటిస్తున్న వారీసు చిత్రం సంక్రాంతి సందర్భంగా తమిళం, తెలుగు భాషల్లో నేరుగా విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా అజిత్ కథానాయకుడి గా నటిస్తున్న తుణివు చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి ఉండబోతోంది. దీంతో ఇప్పటి నుంచే వీరిద్దరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఇలాంటి అభిమానుల మధ్య గొడవ అనేది మదురై జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుంటుంది. అదే విధంగా అజిత్ చిత్ర ఫస్ట్‌లుక్, విజయ్ చిత్ర పోస్టర్ల వ్యవహారంలో ఆదివారం మదురైలో అభిమానులు గొడవకు దిగారు. గోడలపై తమ అభిమాన హీరో పోస్టర్ మాత్రమే పైభాగంలో ఉండాలంటూ ఘర్షణ పడ్డారు. ఫలితంగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. చిత్రాల విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇలాంటిగొడవలు ఇంకెన్ని జరుగుతాయో అనే చర్చ మొదలైంది. -
రణరంగాన్ని తలపించిన ఫుట్‌బాల్ మ్యాచ్.. ముష్టి యుద్ధానికి దిగిన అభిమానులు
Rival Fans Clash At Mexico Football Match: మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు. మ్యాచ్ ప్రారంభంమైన కొద్ది నిమిషాలకే ఇరు జట్ల అభిమానులు దాడులకు దిగడంతో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కుర్చీలు, పిడిగుద్దులతో అభిమానులు ఒకరిపై ఒకరు విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డారు. కుటుంబాలు, చిన్న పిల్లలతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు పరిస్థితి చూసి భయాందోళనలకు గురై చెల్లాచెదురైపోయారు. దీంతో చేసేదేమీ లేక నిర్వహకులు మ్యాచ్‌ను నిలిపేశారు. ఈ గొడవలో 22 మంది గాయపడగా, 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరు జట్ల అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవ తన్నులాటకు దారితీసిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య( ఫిఫా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు ఆదేశించింది. చదవండి: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం -
వకీల్‌సాబ్ : ట్రైలర్‌కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రీల్9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్‌ను విడుదల చేశారు. వైజాగ్ థియేటర్లో ట్రైలర్ చూసేందుకు పవన్ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్ అభిమానులు...'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సినీ నిర్మాత బండ్ల గణేష్..తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న సినిమా ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ వకీల్ సాబ్ ట్రైలర్‌పై రామ్ చరణ్ కామెంట్ -
ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానుల 'ఫుట్‌బాల్'
బ్రెజిల్ : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానులు ఫుట్‌బాల్ ఆడుకున్నారు. బ్రెజిలియన్ లీగ్ మ్యాచ్‌లో గంటపాటు ఫ్యాన్స్ మధ్య ఈ యుద్ధం సాగింది. అట్లెటికో, వాస్కోడిగామా జట్లకు చెందిన మద్దతుదారులు గొడవకు దిగడంతో ... ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. పరిస్థితి చేజారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గొడవను సద్దుమణించేందుకు ... రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ సాయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే వారిలో ఒకరు కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.