ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానుల 'ఫుట్‌బాల్' | Brazilian fans clash in hideous fight during football match | Sakshi
Sakshi News home page

ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానుల 'ఫుట్‌బాల్'

Published Mon, Dec 9 2013 9:59 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానుల 'ఫుట్‌బాల్' - Sakshi

ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానుల 'ఫుట్‌బాల్'

బ్రెజిల్ : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒకరినొకరు కొట్టుకుంటూ అభిమానులు ఫుట్‌బాల్ ఆడుకున్నారు. బ్రెజిలియన్ లీగ్ మ్యాచ్‌లో గంటపాటు ఫ్యాన్స్ మధ్య ఈ యుద్ధం సాగింది. అట్లెటికో, వాస్కోడిగామా జట్లకు చెందిన మద్దతుదారులు గొడవకు దిగడంతో ... ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. పరిస్థితి చేజారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

గొడవను సద్దుమణించేందుకు ... రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ సాయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే వారిలో ఒకరు కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement