పురుషుల మాదిరిగానే మహిళలు కూడా ప్రజా సదుపాయాలకు అర్హులని ఐఏఎస్ అధికారి శరణ్య అరి పేర్కొన్నారు. స్మిళిత పట్టణ ప్రణాళిక భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య అని లింగసమానత్వంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో జరిగిన TEDx (టెక్నాలజీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ డిజైన్) కార్యక్రమంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు.
సమ్మిళిత పట్టణ ప్రణాళిక భారతీయ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్య. మహిళలు పని కోసం 5 నుంచి 8 కి.మీల వరకు నడకను ఎంచుకుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజా సౌకర్యాలు మహిళలకు ఉపయోగకరంగా ఉండవు. వియన్నాలో 90 శాతం కార్యాలయాలు మహిళలకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా సరైన రకమైన ప్రజా సదుపాయాలకు అర్హులు కాదా?అభివృద్ధిలో మహిళలను కూడా భాగస్వాములను చేయండి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత లింగ సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా మహిళల అవకాశాలను మెరుగుపర్చవచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు.
ఇక తన కెరీర్‌లో గత 15 ఏళ్లుగా అంగవైకల్యం ఉన్న ప్రత్యేక వ్యక్తులను తన సిబ్బందిని నియమించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సస్టైనబిలిటీ/ఇఎస్‌జి ఇనిషియేటివ్స్ లీడర్ ఆరాధన. మాజంలోని మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు..ఇలా అందరిని కలుపుకొని పోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని, ఇది సంస్థలకు కూడా మేలు చేస్తుందని ఆమె తెలిపింది. సామాజిక ప్రయోజన సంస్థల్లో కేవలం 19% మహిళలు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారని, పురుషులకు సమానంగా మహిళలకు కూడా అవకావాలు కల్పించాలని ఆమె తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment