విషయాలను అర్థం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రతిస్పందించే తీరులో మెదడుకూ లింగ భేదం (బ్రెయిన్ జెండర్) ఉందని తేలింది. విభిన్న రంగాలను, విషయాలను అర్థం చేసుకునే విషయంలో ‘జెండర్’ ప్రధాన అంశంగా ఉన్నట్టుగానే.. తాజాగా జరిగిన మెదడు అధ్యయనంపై కూడా ‘జెండర్’ ప్రధాన భూమిక ΄పోషిస్తోందని తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ‘జెండర్’ కేంద్రంగా జరిగిన తాజా అధ్యయనాలు మాత్రం విచిత్రంగానూ, కొంచెం విభిన్నంగానూ ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ కేజీ రాఘవేంద్రారెడ్డి: మనిషి మెదడు.. ఓ అంతుచిక్కని వ్యవహారం. మనిషి మొత్తం బరువులో కేవలం 2 శాతం బరువు ఉండే మెదడు మనిషి ఉపయోగించే మొత్తం ఆక్సిజన్‌లో ఏకంగా 20 శాతం ఉపయోగించుకుంటుంది. అంటే ఏ స్థాయిలో మెదడు పనిచేస్తుందో ఇది తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ మెదడును ఏ మేరకు అర్థం చేసుకున్నామని అడిగితే.. ‘మనం ఇంకా క్రిమికీటకాల మెదడునే అర్థం చేసుకోలేదు’ అని అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ క్రిస్టోఫ్ కోచ్ చెబుతున్నారు.
వాస్తవానికి మనిషి మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి 100 ట్రిలియన్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. కానీ.. క్రిమికీటకాల మెదడులో కేవలం 302 సెల్స్ ఉంటాయి. అయినా పురుగు మెదడునే ఇంకా అధ్యయనం చేయలేక΄ోతున్నామని కోచ్ చెబుతున్నారంటే.. మనిషి మెదడును అధ్యయనం చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఊహించడానికి కూడా కష్టమే. కాగా, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తాజాగా నిర్వహించిన పరిశోధన కాస్త విభిన్నంగా సాగింది. ఇది మగ/ఆడ (జెండర్) మెదళ్ల మధ్య వ్యత్యాసాలను తేటతెల్లం చేసింది.
భావోద్వేగ సంబంధాలకే ప్రాధాన్యం
పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మరికొందరు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇందుకోసం అప్పుడే పుట్టిన పిల్లలు తమ మొదటి 24 గంటల సమయాన్ని ఎవరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయానికి వచ్చామని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందుకోసం మొబైల్ బొమ్మతో ΄పాటు కొద్దిమంది వ్యక్తులను ఎదురుగా ఉంచి.. అప్పుడే పుట్టిన 102 మంది పిల్లలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ బారన్, కోహెన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుట్టిన తర్వాత మొదటి 24 గంటల΄పాటు ఎంతసేపు మొబైల్ బొమ్మతోను, మనుషులతోను పిల్లలు సమయాన్ని వెచి్చస్తున్నారో తెలుసుకునేందుకు దీనిని చేపట్టారు. విచిత్రంగా మగపిల్లలు ఎక్కువగా మొబైల్ బొమ్మను చూడటంపైనే దృష్టి కేంద్రీకరించారు.
ఆడ పిల్లలు మాత్రం ఎక్కువగా మనుషులవైపే తమ దృష్టిని ఎక్కువ సమయం కేంద్రీకరించడం గమనార్హం. అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు వస్తువులపైన, అమ్మాయిలకు బంధాలపై ఎక్కువ అటెన్షన్ ఉంటుందని తేల్చారు. అయితే, కేవలం ఈ ఒక్క అంశం ద్వారానే తుది నిర్ణయానికి రాలేమని మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జెండర్ అంశం కేంద్రంగా మెదడు అధ్యయనాలు జరగడం ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటాన్ని మాత్రం లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ ఆహా్వనించాల్సిందే.
పురుషుల్లోనే భయం ఎక్కువ..
సహజంగా శారీరక దారుఢ్యం మహిళల కంటే పురుషులకే కాస్త ఎక్కువనేది తిరుగులేని వాస్తవం. ఇందుకు జన్యుపరమైన అంశాలతో ΄ాటు తరతరాలుగా జరిగిన పని విభజన కూడా ఒక కారణంగా చెబుతారు. కానీ.. మెదడు విషయానికి వస్తే శారీరక దారుఢ్యంతో΄ాటు మెదడు పరిమాణం కూడా స్త్రీలతో ΄ోలిస్తే మగవారిలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. లైజ్ ఎలియట్, అతని టీం సభ్యులు చేసిన అధ్యయనాల ప్రకారం.. పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే పరిమాణంలో 15 శాతం పెద్దగా ఉంటుందని తేలింది. ఇందుకు అనుగుణంగా అమిగ్డాలా (మనిషి భావోద్వేగంతో ముడిపడిన మెదడులోని ఒక భాగం) కూడా పరిమాణంలో పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లోని అమిగ్డాలాను స్త్రీలలోని అమిగ్డాలాతో ΄ోల్చి అధ్యయనం చేస్తే పురుషుల్లోనే ఎక్కువ భయం ఉంటుందని వీరి అధ్యయనాల్లో తేలింది.
స్త్రీలలోనే భావోద్వేగాలు అధికం
పురుషులు, మహిళల్లో ఎవరికి ఎక్కువ భావోద్వేగం ఉంటుందనే అంశంపైనా పరిశోధనలు జరిగాయి. జీవితంలో జరిగిన ఏదైనా ఘటన లేదా సామాజికంగా బాగా గుర్తుండి΄ోయేలా జరిగిన బాధాకరమైన ఘటనలను గుర్తుచేస్తే ఏం జరుగుతుందో పరిశీలించారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే అటువంటి భావోద్వేగ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని తేలింది. పురుషులతో ΄ోలిస్తే ఆ సంఘటన తాలూకు వివరాలను స్త్రీలు వెంటనే గుర్తుతెచ్చుకోవడంతో ΄ాటు పురుషుల కంటే ఎక్కువగా ఆ ఘటనలకు సంబంధించిన విషయాలను కూడా పేర్కొనడాన్ని గమనించారు.
మెదడుపై ‘జెండర్’ అధ్యయనాల్లో కొన్ని..
జెండర్ కేంద్రంగా ఇప్పటికే వివిధ పరిశోధనలు జరిగాయి. 1991లో మొదలైన ఈ అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
- మొదటిసారిగా 1991లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన డయాన్ హాల్‌పెర్న్ ‘సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ కాగి్నటివ్ ఎబిలిటీస్’ అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు.
- 1995లో స్టాండ్‌ఫర్డ్ ప్రొఫెసర్ నైరో షా... స్త్రీ, పురుషుల మెదళ్లపై అధ్యయనం చేశారు.
- 2017లో జెండర్ కేంద్రంగా పలువురు రాసిన 70 ఆరి్టకల్స్‌తో కూడిన ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ రీసెర్చ్’ ప్రత్యేక సంచికను ్ర΄÷ఫెసర్ లారి కాహిల్ వెలువరించారు.
- 2021లో బ్రిటన్‌లో 40 సంవత్సరాల వయసు పైబడిన 5 లక్షల మందికి చెందిన జెనటిక్, హెల్త్ డేటాపై ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన గినా రిప్పన్ అనే న్యూరో బయాలజిస్టు అధ్యయనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment