ఇకపై వారిని అలా పిలువరాదు | Dont Call Sex Workers : Minister Jayamala | Sakshi
Sakshi News home page

ఇకపై వారిని అలా పిలువరాదు

Jun 13 2018 8:57 AM | Updated on Jul 23 2018 9:15 PM

Dont Call Sex Workers : Minister Jayamala - Sakshi

బొమ్మనహళ్లి : సెక్స్‌ వర్కర్లను ఇక పైన ధమనిత మహిళలు అని  పిలవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి జయమాల సూచించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం తన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధిపనులు, అమలు తీరు, ప్రగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. 

మంత్రి మాట్లాడుతూ సెక్స్‌ వర్కర్లను ఆ పేరుతో పిలు వరాదని, వారిని ధమనిత మహిళ అని పిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వెనుకబడిన వర్గాల మహిళల సంక్షేమానికి అమలు చేసే పథకాలు లబ్ధిదా రుల దరిచేరేలా చూడాలన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ముందుండాలని అన్నారు. కన్నడ, సంస్కృతి శాఖలో కళాకారులకు పింఛన్ల పంపిణీ, ఇతర సదుపాయాల కల్పనపై కసరత్తు చేస్తామన్నారు. 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement