
సాక్షి, బెంగళూరు: సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను కూడా నిర్మాతల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొవలసి వచ్చిందని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు వార్త ఛానెల్ నిర్వహించిన సెక్సిజం ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి సినిమా చేస్తున్న సమయంలో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, ఓ కన్నడ దర్శక నిర్మాత ఒకరు తమిళంలో అవకాశం ఇస్తామని, సహకరించాలని సూచించాడని చెప్పారు. అయితే తాను అంతే ఘాటుగా సమాధానం ఇచ్చానని చెప్పారు. అందుకే కన్నడ, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయన్నారు.
ఇప్పుడెందుకు బహిర్గతం చేశారు :
పదేళ్ల క్రితం ఎదురైన అనుభవాలను హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఇపుడెందుకు బహిర్గతం చేసారో ఆమెకే తెలియాలని కన్నడ వాణిజ్య మండలి డైరెక్టర్ సా.రా.గోవిందు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అప్పుడే నిర్మాత మండలి దృష్టికి తెచ్చి ఉంటే చర్యలు తీసుకునే ఉండేవారని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment