ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్‌కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్‌పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్‌కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని అడిగేవాడు. కొన్నిసార్లు ఇంట్లో ఎవరూ లేని సమమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన నచ్చని యువతి పెళ్లిచేసుకోవటానికి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు ఎలాగైనా పగతీర్చుకోవాలని భావించాడు.
బుధవారం తండ్రి ఆర్‌కే శర్మ ఏదో పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా, లవ్ శర్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం ఆ పని మనిషి వంట చేయడానికి వచ్చింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న లవ్ శర్మ ఇదే అదునుగా భావించాడు. ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించటంతో కత్తితో బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గొంతుపై కత్తిపెట్టి బెదిరించి, పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. గురువారం ఉదయం నిందితుడు గాఢనిద్రలో ఉండగా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావటంతో లవ్ శర్మను జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment